'సేవా సంకల్ప అభియాన్’ వర్క్‌షాప్....

'సేవా సంకల్ప అభియాన్’ వర్క్‌షాప్....

మెదక్, సెప్టెంబర్ 12 (ప్రజాస్వరం) :

మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన ‘సేవా సంకల్ప అభియాన్’ జిల్లా స్థాయి వర్క్‌ షాప్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు అభియాన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. బూత్ స్థాయిలో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, మొక్కలు నాటడం, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, వికసిత్ భారత్ లక్ష్య సాధన కు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, అభియాన్ కన్వీనర్ ఈర్ల రంజిత్ రెడ్డి, సంఘసాని సురేష్, శ్రీనివాస్, రమేష్ గౌడ్, రాగి రాములు, సుభాష్ గౌడ్, నల్లాల విజయ్, రాజేందర్, శంకర్ గౌడ్, కౌన్సిలర్లు రాజమణి, అఖిల భరత్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

మేడ్చల్ మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.. మేడ్చల్ మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..
        ప్రజాస్వరం,మేడ్చల్ : ప్రతినిధి:వెంకట్  మేడ్చల్ మండల్ ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్‌లోని హైటెక్ వాల్యూ
'సేవా సంకల్ప అభియాన్’ వర్క్‌షాప్....
మేడ్చల్‌లో గుర్తు తెలియని వ్యక్తి.....
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పుణ్యం...
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన...
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన...
తునికి ఖల్సాలో స్టిక్కీ ట్రాప్స్ ఏర్పాటు.....