ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పుణ్యం...

మాజీ మేయర్ మేకల కావ్య...

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పుణ్యం...

జవహర్ నగర్, సెప్టెంబర్ 11 (ప్రజాస్వరం) :

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దేవునికి చేసిన సేవతో సమానమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య అన్నారు.శుక్రవారం అమావాస్య పురస్కరించుకొని జవహర్ నగర్ లో మేకల అయ్యప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ.. మా కుటుంబం బికేఆర్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో అధినేత మేకల అయ్యప్ప ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు గొప్ప వరమన్నారు. ప్రతి అమావాస్య బాలాజీ నగర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు బండ కింది ప్రసాద్ గౌడ్, సుధాకర్ చారి ,యువజన విభాగం అధ్యక్షులు మేకల భార్గవరామ్,స్థానిక నాయకులు,పంతంగి సిద్ధులు యాదవ్,పొలాస సాయికుమార్,కూటికంటి వెంకటేష్ గౌడ్.పొలాస సాయికుమార్, మైనార్టీ నాయకుడు అహ్మద్ భాషా కార్యకర్తలు,కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.