మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల తనిఖీ...
By Prajaswaram
On
విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి ...
మెదక్ ,ఆగస్టు 29 (ప్రజాస్వరం) :
నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల, కళాశాలను కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సూఫీ జానీ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు శాతం, పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజన శాల ను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనానికి ఉపయోగిస్తున్న సరుకులు, కూరగాయల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కళాశాల సిబ్బందికి సూఫీ జానీ సూచించారు. విద్యార్థుల సౌకర్యాలు, వారి విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
Latest News
29 Aug 2026 19:22:01
విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి ... మెదక్ ,ఆగస్టు 29 (ప్రజాస్వరం) : నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో...


