నో మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీలను సరిచేసుకోవాలి....

మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్...

 నో మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీలను సరిచేసుకోవాలి....

మెదక్, ఆగస్టు 27 (ప్రజాస్వరం) :

 

ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన, సవరణల అంశాలపై మెదక్ పట్టణంలోని నవాబ్ పేట్ లో 14, 15 వార్డుల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్ దొంతి లక్ష్మీ పాల్గొన్నారు. మ్యాపింగ్ 2002 లేని ఓటర్ వివరాలు డాక్యుమెంట్ సమర్పించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ సమక్షంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఫారం–6 సమర్పించాలని వారు సూచించారు. అలాగే ఓటరు జాబితాలో పేరు, వయస్సు, చిరునామా, ఫోటో, బంధుత్వం తదితర వివరాల్లో సవరణలు అవసరమైతే ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజలు, బిఎల్ఓ లు, బిఎల్ఏ లు, సంబంధిత అధికారులు ఓటరు జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సరిచేసుకుని నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీవో స్వామి, జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్, బిఎల్ ఓ లు జబిన ఫాతిమా, బుచ్చమ్మ, నీలిమ పాల్గొన్నారు.

Latest News

గొప్ప మనసు చాటుకున్న రాజబొల్లారం గ్రామ ప్రజలు... గొప్ప మనసు చాటుకున్న రాజబొల్లారం గ్రామ ప్రజలు...
  మేడ్చల్, ఆగస్టు 27 (ప్రజాస్వరం) : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన గుమ్మడిదల పద్మ రెండో కుమార్తె లత (21) అనారోగ్యంతో మృతి
తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరికలు...
యూరియా కోసం జాతీయ రహదారి 44 పై రైతుల ధర్నా....
నో మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీలను సరిచేసుకోవాలి....
విద్యుత్ షాక్‌ తో యువకుడు మృతి...
మెదక్ లో సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దహనం
రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి