లంబాడి నాయకులను ముందస్తు అరెస్టు.....
By Prajaswaram
On
తూప్రాన్, సెప్టెంబర్ 11ప్రజాస్వరం :
ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడి ఐక్యవేదిక మెదక్ జిల్లా అధ్యక్షులు నాలుగో వార్డ్ కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్ శుక్రవారం ఉదయం ముందస్తు అరెస్టు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా లంబాడీల హక్కుల కోసం సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిరము అడవిలో కాకుండా హైదరాబాదులో ఉండాలని ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలని విద్యార్థుల స్కాలర్షిప్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి గిరిజన విద్యార్థి సంఘం పిలుపుమేరకు కార్యక్రమానికి ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో తూప్రాన్ మున్సిపల్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్ దిగావత్ శివ నాయక్ తదితరులు ఉన్నారు.
Latest News
11 Sep 2026 20:05:44
జవహర్ నగర్, సెప్టెంబర్ 11 (ప్రజాస్వరం) : ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దేవునికి చేసిన సేవతో సమానమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్...


