బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ -
మేడ్చల్ జిల్లా పద్మశాలి సంఘం
By Prajaswaram
On
మేడ్చల్, ప్రజాస్వరం :
కాంగ్రెస్ పార్టీ మరొకసారి బీసీ మరియు మహిళా వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని మునీరాబాద్ మాజీ సర్పంచులు గణేష్ నేత చిట్టి మిల్ల మరియు రాగజ్యోతి నేత చిట్టిమిల్ల తెలిపారు. ఒక బీసీ మహిళా బిడ్డని అత్యంత దారుణంగా క్యాబినెట్ ర్యాంకు నుంచి బర్తరప్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని వారు వాపోయారు.కూతురు ఏదో మాట్లాడిందని తల్లిని శిక్షించడం అత్యంత దారుణమైన చర్య అని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక మాటలు మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,తూర్పు జయప్రకాశ్ రెడ్డి లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా కేవలం కూతురేదో మాట్లాడిందని కొండా సురేఖని క్యాబినెట్ నుండి బర్తరప్ చేయడం సిగ్గుచేటని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల పార్టీగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక రోజులు దగ్గర పడ్డాయని వచ్చే ఎన్నికల్లో బీసీలు, మహిళలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. పద్మశాలీల ఆడబిడ్డను అవమానించిన మీ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతుందని కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం పద్మశాలిలమంతా పనిచేస్తామని తెలిపారు...... ఈ కార్యక్రమంలో మునీరాబాద్ మాజీ ఉపసర్పంచ్ గుండ్రోల్ల నర్సింగరావు మునీరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కైరం కొండ సత్యనారాయణ నేత, గుర్రం దేవేందర్ నేత , కైరం కొండ నరేందర్ నేత , గుర్రం జనార్ధన్ నేత , కైరం కొండ రవీందర్ నేత, చిట్టిమిల్ల అరుణ నేత,చిట్టిమిల్ల భవాని నేత తదితరులు పాల్గొన్నారు.
Latest News
05 Sep 2026 15:48:23
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్...


