మెదక్ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు...
By Prajaswaram
On
మెదక్ ,ఆగస్టు 30 (ప్రజాస్వరం) :
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. మోడరేటర్, ఇన్చార్జి బిషప్ రూబెన్ మార్క్ ముఖ్య అతిథిగా హాజరై వాక్య పరిచర్య చేశారు. ఈ సందర్భంగా మహిళలు ఆలపించిన ప్రత్యేక గీతం ఆకట్టుకుంది. భక్తులు ప్రార్థనల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రెస్బీటర్ ఇన్చార్జి శాంతయ్య, గురువులు, చర్చి కమిటీ గంట సంపత్ సభ్యులు పాల్గొన్నారు.
Latest News
30 Aug 2026 18:23:38
ప్రజాస్వరం, మనోహరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామపంచాయతీ పరిధిలోని మధిర గ్రామమైన తుపాకులపల్లి లో కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఖరాబ్ కావడంతో విద్యుత్ సరఫరాకు...


