తుపాకులపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు....
By Prajaswaram
On
ప్రజాస్వరం, మనోహరాబాద్ :
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామపంచాయతీ పరిధిలోని మధిర గ్రామమైన తుపాకులపల్లి లో కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఖరాబ్ కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.విషయాన్ని తెలుసుకున్న పర్కిబండ సర్పంచ్ ఠాకూర్ మోతిబాయి లక్ష్మణ్ సింగ్ వెంటనే స్పందించి విద్యుత్ శాఖ ఏఈ తో మాట్లాడి 15 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించారు. తుపాకులపల్లి గ్రామంలో తరచుగా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అదనంగా 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా తెప్పించడం జరిగింది.గ్రామ ప్రజలకు నిరంతరంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో సర్పంచ్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిమ్మల మహేష్ , 7వ వార్డు మెంబర్ నిమ్మల మల్లేష్ యాదవ్ , యువత, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం గా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వమే మా బాధ్యత అని సర్పంచ్ అన్నారు.
Latest News
30 Aug 2026 18:23:38
ప్రజాస్వరం, మనోహరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామపంచాయతీ పరిధిలోని మధిర గ్రామమైన తుపాకులపల్లి లో కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఖరాబ్ కావడంతో విద్యుత్ సరఫరాకు...


