జాతీయ రహదారి పై కారులో మంటలు....
By Prajaswaram
On
చేగుంట, ఆగస్టు 30 (ప్రజాస్వరం) :
మెదక్ జిల్లా చేగుంట పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డిపల్లి బ్రిడ్జి వద్ద 44వ జాతీయ రహదారిపై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బిక్కనూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో మంటలు గుర్తించిన వెంటనే డ్రైవర్ తో పాటు అందులో ఉన్నవారు అప్రమత్తమై వాహనం నుంచి బయటకు దిగారు.కొద్దిసేపటికే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు కారులో ఉన్నవారు సకాలంలో బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళన నెలకొంది.అనంతరం మంటలను అదుపు చేశారు.
Latest News
30 Aug 2026 18:23:38
ప్రజాస్వరం, మనోహరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామపంచాయతీ పరిధిలోని మధిర గ్రామమైన తుపాకులపల్లి లో కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఖరాబ్ కావడంతో విద్యుత్ సరఫరాకు...


