శేరిపల్లి పాఠశాలలో ఘనంగా పాఠశాల రూపాంతర కార్యక్రమం....

శేరిపల్లి పాఠశాలలో ఘనంగా పాఠశాల రూపాంతర కార్యక్రమం....

వర్గల్, సెప్టెంబర్ 04 (ప్రజాస్వరం): 

 

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శేరిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శేరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో జన్మాష్టమి సందర్భంగా పాఠశాల రూపాంతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. థామ్సన్ రాయిటర్స్, మ్యాజిక్ బస్ సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.పాఠశాలకు వైట్‌వాష్ చేయడంతో పాటు ఆకర్షణీయమైన మ్యూరల్ ఆర్ట్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్‌ను థామ్సన్ రాయిటర్స్ సంస్థ అందించింది. దీంతో పాఠశాల ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా మారింది.అనంతరం నిర్వహించిన జన్మాష్టమి వేడుకల్లో విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో నృత్య ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. విద్యార్థుల ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పావనిమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల రూపాంతరానికి సహకరించిన థామ్సన్ రాయిటర్స్, మ్యాజిక్ బస్ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల రూపాంతరం వల్ల విద్యార్థులకు మెరుగైన, ఆహ్లాదకరమైన అభ్యాస వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో థామ్సన్ రాయిటర్స్, మ్యాజిక్ బస్ సంస్థల ఉద్యోగులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. పాఠశాల రూపాంతరంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

Latest News

మేడ్చల్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్ భారీ ర్యాలీ... మేడ్చల్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్ భారీ ర్యాలీ...
ప్రజాస్వరం,మేడ్చల్‌ :   మేడ్చల్ లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్...
పార్క్ వుడ్ టవర్స్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు....
మేడ్చల్‌లో బెలెనో కారు బోల్తా ...
ప్రత్యేక ఓటర్‌ జాబితా ప్రక్రియతో రెవెన్యూ సిబ్బందిపై అదనపు పని భారం...
శేరిపల్లి పాఠశాలలో ఘనంగా పాఠశాల రూపాంతర కార్యక్రమం....
బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ -  
తూప్రాన్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు....