ఘనంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు....

ఘనంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు....

మాసాయిపేట, (ప్రజస్వరం) :

ప్రతినిధి( చిరంజీవి)

మాసాయిపేట మండల కేంద్రంలో ఉజ్జయిని మహంకాళి జాతర ఉత్సవాలు గత రెండు రోజులుగా భక్తిశ్రద్ధతో జరుగుతున్నాయి. గ్రామ సమీపంలో కొలువైన అమ్మవార్లకు ఆదివారం రాత్రి బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుల్లో పోతరాజు విన్యాసాల మధ్య ఈ ఉత్సవాలు జరిగాయి సోమవారం సోమవారం దేవత మూర్తులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గ్రామస్తులు మహిళలు ఓడిబియ్యం కానుకలు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. సాయంత్రం వేళ శివసత్తుల పూనకాలు గౌవురంగం నిర్వహించారు శివసత్తులు రంగంలో తమ భవిష్యవాన్ని వినిపించారు. మంగళవారం నాడు గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయని ఉత్సవ నిర్వాహకులు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేష్, మాజీ సర్పంచ్లు మధుసూదన్ రెడ్డి, నాగరాజు, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాములు గౌడ్, సభ్యులు పాటు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు సత్తయ్య నర్సింలు శ్రీనివాసు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఘనంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు.... ఘనంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు....
మాసాయిపేట, (ప్రజస్వరం) : ప్రతినిధి( చిరంజీవి) మాసాయిపేట మండల కేంద్రంలో ఉజ్జయిని మహంకాళి జాతర ఉత్సవాలు గత రెండు రోజులుగా భక్తిశ్రద్ధతో జరుగుతున్నాయి. గ్రామ సమీపంలో కొలువైన...
మహా పాదయాత్రలో మనోహరబాద్ నాయకులు ....
రోడ్డు కోసం.. పాదయాత్ర....
ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం....
తుపాకులపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు....
ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక ....
జాతీయ రహదారి పై కారులో మంటలు....