ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం....

ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి.....

ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం....

నర్సాపూర్ రోడ్ల అభివృద్ధిపై ఉద్యమం....

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం సీతకన్ను....

మహా పాదయాత్రలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం...

వెల్దుర్తి (ప్రజాస్వరం):

ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వెల్దుర్తి మండల కేంద్రం నుండి మెదక్ జిల్లా కేంద్రానికి గల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని మహా పాదయాత్రను ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మహా పాదయాత్రను కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. అనంతరం పాదయాత్ర గుండా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వెల్దుర్తి మెదక్ రోడ్డు అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 కోట్ల 68 లక్షల నిధులు మంజూరు కాగా రోడ్డు నిర్మాణానికి రెండు టెండర్లు కావడంతో పనులు జరగలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు అభివృద్ధి విషయమై 12సార్లు మంత్రులకు సమస్యను విన్నవించిన పట్టించుకోలేదని అసెంబ్లీలో సైతం ఈ రోడ్డు ప్రస్తావనను ప్రశ్నించానని అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఒంటెత్తు పోకడకు పోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదని రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి అని తెలిపారు. మెదక్ వెల్దుర్తి రోడ్డు పూర్తిగా గుంతల మై ప్రమాదకరంగా మరి ఎందరో గాయపడి కొన్ని కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి అని అయినప్పటికీ ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీత కన్ను చూపుతుందని నియోజకవర్గానికి ఓ యంగ్ ఇండియా స్కూలు మంజూరు కాగా తన నియోజకవర్గం లో చిలిపి చెడ్ మండలం జక్కపల్లిలో25 ఎకరాల ప్రభుత్వ భూమి చూపినప్పటికీ కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉన్నానని సాకుతో పాఠశాల మంజూరు ను అడ్డుకుంటున్నారు. ఇకనుండి నియోజకవర్గం సమస్యలపై ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయకుంటే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీసి ఉద్యమాలు పోరాటాలు చేసి అభివృద్ధి చేసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీచైర్మన్ చంద్ర గౌడ్, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ ,మాజీ ఎంపీపీ హరికృష్ణ, జడ్పిటిసి రమేష్ గౌడ్, మెదక్ ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్ ,స్థానిక నాయకులు మోహన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భూపాల్ రెడ్డి, అశోక్ గౌడ్, కృష్ణ కాజా, అశోక్ రెడ్డి ,రంగారెడ్డి ఇతర మండలాల ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Latest News

ఘనంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు.... ఘనంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు....
మాసాయిపేట, (ప్రజస్వరం) : ప్రతినిధి( చిరంజీవి) మాసాయిపేట మండల కేంద్రంలో ఉజ్జయిని మహంకాళి జాతర ఉత్సవాలు గత రెండు రోజులుగా భక్తిశ్రద్ధతో జరుగుతున్నాయి. గ్రామ సమీపంలో కొలువైన...
మహా పాదయాత్రలో మనోహరబాద్ నాయకులు ....
రోడ్డు కోసం.. పాదయాత్ర....
ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం....
తుపాకులపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు....
ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక ....
జాతీయ రహదారి పై కారులో మంటలు....