రోడ్డు కోసం.. పాదయాత్ర....
వెల్దుర్తి–పిల్లికొట్టాల డబుల్ రోడ్డుకు డిమాండ్..
వెల్దుర్తి–పిల్లికొట్టాల డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వెల్దుర్తి నుంచి మెదక్ కలెక్టరేట్ వరకు పాదయాత్రగా బయలుదేరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా.. ప్రభుత్వం మారిన అనంతరం వాటిని రద్దు చేసి పనులు నిలిపివేశారని నాయకులు ఆరోపించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేసి డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కోదండ కృష్ణ గౌడ్, మోహన్ రెడ్డి, అశోక్ గౌడ్, ప్రతాప్ రెడ్డి వివిధ మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.


