మహా పాదయాత్రలో మనోహరబాద్ నాయకులు ....
By Prajaswaram
On
ప్రజాస్వరం, మనోహరబాద్ :
వెల్దుర్తి నుంచి మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో రోడ్డును బాగు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేపట్టిన మహా పాదయాత్రకు మనోహరాబాద్ మండల నాయకులు తరలివెళ్లి యాత్రలో పాల్గొన్నారు. మాజీ జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్, జిల్లా ఉప సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షులు రేణు కుమార్, పార్టీ ముఖ్య నాయకులు లక్ష్మణ్ సింగ్, పోతారం మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, దండుపల్లి మాజీ ఉపసర్పంచ్ మహేందర్ గౌడ్, పోతారం మాజీ ఉపసర్పంచ్ వీరేష్, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ బిక్షపతి, మనోహరాబాద్ మాజీ పార్టీ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నాయకులు శైలేందర్లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు యాత్రలో పాల్గొన్న వారిలో వున్నారు.
Latest News
01 Sep 2026 06:13:06
మాసాయిపేట, (ప్రజస్వరం) : ప్రతినిధి( చిరంజీవి) మాసాయిపేట మండల కేంద్రంలో ఉజ్జయిని మహంకాళి జాతర ఉత్సవాలు గత రెండు రోజులుగా భక్తిశ్రద్ధతో జరుగుతున్నాయి. గ్రామ సమీపంలో కొలువైన...


