మేడ్చల్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్ భారీ ర్యాలీ...

మేడ్చల్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్ భారీ ర్యాలీ...

ప్రజాస్వరం,మేడ్చల్‌ :

 

మేడ్చల్ లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్,మాజీ కోప్షన్ మెంబెర్ నవీన్ రెడ్డి,విద్యార్థి నాయకుడు సుశాంత్ రెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థుల చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతో కీలకమని, బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కళాశాలలకు ఫీజులు చెల్లించలేక విద్యార్థులు చదువులు కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సందీప్ గౌడ్,పాండు గుప్తా,మండల ఈశ్వరయ్య,శైలేందర్,చంద్ర శేఖర్,విఠల్,రఘుపతి రెడ్డి,సాయి కమల్,చంద్ర శేఖర్ రెడ్డి,వసంత,శారద,పద్మ,వరలక్ష్మి,లావణ్య లతో బి ఆర్ ఎస్ వి నాయకులు శ్రీనాథ్ ముదిరాజ్,రఘు,చంటి,అబ్రహాం,పాటు తదితరులు పాల్గొన్నారు.

Latest News

మేడ్చల్‌లో విషాదం.. బాలిక అనుమానాస్పద మృతి ... మేడ్చల్‌లో విషాదం.. బాలిక అనుమానాస్పద మృతి ...
మేడ్చల్ , ప్రజాస్వరం  : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదోని గడ్డ తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది.ఓ బాలిక ఇంట్లో ఉరివేసుకుని పాల్పడినట్లు సమాచారం.అయితే అదే...
మేడ్చల్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్ భారీ ర్యాలీ...
పార్క్ వుడ్ టవర్స్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు....
మేడ్చల్‌లో బెలెనో కారు బోల్తా ...
ప్రత్యేక ఓటర్‌ జాబితా ప్రక్రియతో రెవెన్యూ సిబ్బందిపై అదనపు పని భారం...
శేరిపల్లి పాఠశాలలో ఘనంగా పాఠశాల రూపాంతర కార్యక్రమం....
బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ -