వంటావార్పుకు తరలిన బీఆర్ఎస్ నాయకులు....
By Prajaswaram
On
ప్రజాస్వరం, మనోహరాబాద్ :
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ గజ్వెల్ లో బీఆర్‌ఎస్ నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి మనోహరాబాద్ మండలం నుంచి బిఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, రైతు రుణమాఫీ, రైతు భరోసా హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల బీ ఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, కొండాపూర్ మాజీ ఉపసర్పంచ్ నూకల వెంకటేష్, దండుపల్లి మాజీ ఉపసర్పంచ్ మహేందర్ గౌడ్, కొండాపూర్ పార్టీ మాజీ అధ్యక్షులు సురేష్, రంగాయపల్లి పార్టీ మాజీ అధ్యక్షులు బాబు, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ బిక్షపతి, మంగ్యా నాయక్, మనోహరాబాద్ మాజీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, నాయకులు, దుర్గేష్ యాదవ్,శైలేందర్ కుమార్, గౌడ్,సంతోష్ యాదవ్, మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షులు రతన్ లాల్ లతోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.
Latest News
03 Sep 2026 20:26:52
గోపిక కృష్ణుడి వేషధారణలో అలరించిన చిన్నారులు.... ప్రజాస్వరం, తూప్రాన్, 03 సెప్టెంబర్ : మెదక్ జిల్లా తూప్రాన్ 5 వ వార్డు విద్యానగర్ కాలనిలో శ్రీ కృష్ణ...


