ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు ...

ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు ...

ప్రజాస్వరం, మేడ్చల్ :

గుండ్ల పోచంపల్లి-299 డివిజన్ : వందేళ్ళకు పైగా కాస్తు చేస్తున్న భూములను ఇప్పుడు 22 A లో చేర్చడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మునీరాబాద్ మాజీ సర్పంచ్ గణేష్ నేత చిట్టిమిల్ల తెలిపారు.గుండ్ల పోచంపల్లి-299 డివిజన్ పరిధిలోని మునీరాబాద్ లో నేడు గుండ్ల పోచంపల్లి బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనలో నిర్లక్ష్యానికి గురైన అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయరంగం మరియు 22 A నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవసాయ భూములపై..... ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ఇంటింటికి బాకీ కార్డులు పంచారు ........ అనంతరం గణేష్ నేత చిట్టిమిల్ల, రాగ జ్యోతి చిట్టిమిల్ల,మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, సంజీవ లు మాట్లాడుతూ వందల సంవత్సరాల నుంచి కాస్ట్ చేస్తున్న భూములను ఇప్పుడు 22 ఏ లో చేర్చి రైతులను ఇబ్బందులకు గురి చేయడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన చర్యలకు నిదర్శమని తెలిపారు. ప్రజా పాలన పేరుతో ప్రజా కంటక పాలన కొనసాగిస్తున్నారని వాపోయారు. వ్యవసాయ రంగాన్ని కుందేలు చేసి రైతుకు సరైన విద్యుత్, యూరియా, రైతుబరోసా, రైతు బీమా ఇవ్వకుండా రైతులని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. రైతులకు వెంటనే న్యాయం చేయాలని, 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూములను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులలో ఇచ్చిన హామీలను పూర్తి చేస్తానని చెప్పి నేటికీ 1000 రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోవడంతో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రజల పక్షాన, ప్రతిపక్ష పార్టీగా బాధ్యతతో ఆందోళనకు దిగిందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బి ఆర్ ఎస్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గణేష్ నేత చిట్టిమిల్ల,మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, రాగజ్యోతి చిట్టిమిల్ల, బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు డాక్టర్ సంజీవ్,దయానంద్ యాదవ్, రాజు, మునీరాబాద్ ఉప సర్పంచ్ నర్సింగరావు,మాజీ కౌన్సిలర్స్ హేమంత్ రెడ్డి, బేరి బాలరాజ్లు, దుష్యంత్ రెడ్డి,రామకృష్ణ,రాంచంద్రా రెడ్డి,నరేందర్, దేవేందర్,స్వరూప, అరుణ, రేణుక, భవానీ, మంజుల,సత్యనారాయణ,హరిబాబు జీవన్ రెడ్డి, జ్ఞాన్ కిరణ్ రెడ్డి, సురేందర్, రవీందర్, ఆంజనేయులు,శేఖర్,జనార్దన్ తదితరులు పాల్గొన్నారు ....

Latest News

తూప్రాన్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.... తూప్రాన్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు....
గోపిక కృష్ణుడి వేషధారణలో అలరించిన చిన్నారులు.... ప్రజాస్వరం, తూప్రాన్, 03 సెప్టెంబర్ : మెదక్ జిల్లా తూప్రాన్ 5 వ వార్డు విద్యానగర్ కాలనిలో శ్రీ కృష్ణ...
ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు ...
విద్యార్థులకు యూనిఫార్మ్ లు పంపిణీ .....
వంటావార్పుకు తరలిన బీఆర్ఎస్ నాయకులు....
ఘనంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు....
మహా పాదయాత్రలో మనోహరబాద్ నాయకులు ....
రోడ్డు కోసం.. పాదయాత్ర....