తెలంగాణ NSUI రాష్ట్ర కార్యదర్శిగా మెనంగిరి రవితేజ....

తెలంగాణ NSUI రాష్ట్ర కార్యదర్శిగా మెనంగిరి రవితేజ....

ప్రజాస్వరం,మేడ్చల్ :

తెలంగాణ రాష్ట్ర NSUI నూతన రాష్ట్ర, జిల్లా కమిటీలను సెప్టెంబర్ 9న ప్రకటించారు. ఈ నూతన కమిటీల్లో మేడ్చల్ జిల్లా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 299వ డివిజన్ గౌడవెల్లికి చెందిన యువ నాయకుడు మెనంగిరి రవితేజను తెలంగాణ NSUI రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన NSUI జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్, తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని రవితేజ తెలిపారు. విద్యార్థుల హక్కులు, విద్యా రంగ సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగం తదితర అంశాలపై విద్యార్థుల తరఫున నిరంతరం పోరాడుతానని పేర్కొన్నారు.తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ NSUI బలోపేతానికి కృషి చేస్తానని రవితేజ తెలిపారు. తన నియామకంపై గౌడవెల్లి ప్రాంతానికి చెందిన యువత, కాంగ్రెస్ నాయకులు, NSUI కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ రవితేజకు అభినందనలు తెలిపారు.

Latest News

మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు..... మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు.....
ప్రజాస్వరం,మేడ్చల్ :   మేడ్చల్ కిష్టాపూర్ లోని TGSWR గురుకుల విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం శాపంగా మారింది.ఓ వైపు ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందిచేందుకు కోట్లల్లో...
మేడ్చల్‌లో ఫుడ్ కమిషన్ ఆకస్మిక తనిఖీలు...
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ల సీజ్ ....
తెలంగాణ NSUI రాష్ట్ర కార్యదర్శిగా మెనంగిరి రవితేజ....
షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలి..
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జన్మదిన వేడుకలు...
మేడ్చల్ :మయోర ఇండియా ఉద్యోగుల ఆందోళన ఉధృతం....