మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జన్మదిన వేడుకలు...
By Prajaswaram
On
ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి 73వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మేడ్చల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ప్రభుత్వ ఆసుపత్రి)లో చికిత్స పొందుతున్న రోగులకు నాయకులు, కార్యకర్తలు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, పార్టీ నాయకులు సందీప్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి, అలీ, రఘుపతి రెడ్డి, విష్ణు చారీ, సుశాంత్ రెడ్డి, ప్రభాకర్, శైలేందర్, దగ్గు పవన్, అవుతార్ తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News
09 Sep 2026 14:47:33
నార్సింగి,సెప్టెంబర్ 9 (ప్రజాస్వరం) : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్...


