10 సంవత్సరాల పాలనలో ఏం చేశారు ....

కృష్ణారెడ్డి .....

10 సంవత్సరాల పాలనలో ఏం చేశారు ....

మాసాయిపేట, ప్రజాస్వరం :

గత పది సంవత్సరాల కాలంలో మాసాయిపేట గ్రామానికి ఏ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల ఆయన మాట్లాడారు. మాసాయిపేట 13 గ్రామాలను కలిపి మాసాయి పేట మండలం గా ఏర్పడిందని నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి సహకారంతో మండల పరిధిలోని నాగ్సన్ పల్లి, హకీంపేట్ గ్రామాలకు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు.తమ గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని అవి కూడా పూర్తయి కొందరు గృహప్రవేశాలు కూడా చేశారన్నారు. ఆవుల రాజి రెడ్డి తన ట్రస్టు ద్వారా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎంతోమందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి మందులు సమకూర్చి వారికి కంటి ఆపరేషన్ కూడా చేయించారని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు తమ మండలానికి ఏమి అభివృద్ధి చేశారని కాంగ్రెస్ నాయకుడు ఆవుల రాజిరెడ్డి పై దురుసుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సిద్ధ రాములు గౌడ్ 13 గ్రామాల సర్పంచులు,కార్యకర్తలు పాల్గొన్నారు.