మేడ్చల్ ఎక్సైజ్ నూతన సీఐగా దీపిక బాధ్యతల స్వీకరణ...

మేడ్చల్ ఎక్సైజ్ నూతన సీఐగా దీపిక బాధ్యతల స్వీకరణ...

ప్రజాస్వరం,మేడ్చల్ :

మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న నవనీత రెడ్డి బదిలీ అయ్యారు.నవనీత రెడ్డి స్థానంలో ఆలేరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐగా విధులు నిర్వహించిన దీపిక మేడ్చల్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలు, గుడుంబా తయారీ, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని దీపిక తెలిపారు.