కాంగ్రెస్ వెయ్యి రోజుల పరిపాలనలో పదేళ్లు వెనుకకు ...
వెయ్యి రోజుల విధ్వాంస పాలనపై ఇంటింటి కి బాకీ కార్డు -కౌన్సిలర్ జైపాల్ నాయక్...
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ లోని నాలుగో వార్డ్ లో మున్సిపల్ కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్ కాంగ్రెస్ వెయ్యి రోజుల విధ్వంసం పరిపాలనపై ఇంటింటికి బాకీ కార్డుల పంచుతూ మీడియాతో మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ ఆదేశాలు సారాంశం భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి బాకీ కార్డులు పంచుతున్నామని జైపాల్ రాథోడ్ అన్నారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ 1000 రోజుల పరిపాలనలో పదేళ్లు వెనుకకువైందని ప్రజలకు అక్కరకచే పనులు వదిలేసి దోచుకునే పరిపాలన విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉందని ఇంటింటికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ఇవ్వకుంట కాలం గడుపుతుందో దానికి గాను అన్ని రంగాలలో మోసపూరిత హామీలు ఇచ్చి రైతులకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఆటో డ్రైవర్లకు ఏ వర్గానికి ఏ హామీలు నెరవేరుచుకుంటా మూడేళ్లు కాలం గడుపుకొని సాగుతున్న విధ్వంస పరిపాలనపై ప్రజలకు వివరణ ఇస్తున్నామని రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉంటుందని ప్రజలు మంచి స్పందన ఉందని వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నే మళ్లీ సీఎం చేద్దాం అని ప్రజలలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అనిల్, కొత్త నర్సింలు ,శ్రీకాంత్, నరేష్, హైమద్, శ్రీను శేఖర్ లూకా తదితరులు పాల్గొన్నారు.


