బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు.....

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు.....

 ప్రజాస్వరం, మెదక్ / తూప్రాన్ : 

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల బీ ఆర్ ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మనోహరాబాద్ పోలీసులు మండలంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి తూప్రాన్ డిఎస్పి కార్యాలయానికి తరలించారు. ఉదయం నుంచి వారిని పోలీసుల అదుపులోనే ఉంచారు. ఎర్రవల్లి లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేశ్వర్ ముదిరాజ్, నాయకులు లక్ష్మణ్ సింగ్ , రేణు కుమార్ నరేందర్ గౌడ్, కాయితయ్య, సాయి, మహేష్, బిక్షపతి తదితరులు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.

Latest News

షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలి.. షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలి..
నార్సింగి,సెప్టెంబర్ 9 (ప్రజాస్వరం) : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై షాద్‌నగర్‌ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్...
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జన్మదిన వేడుకలు...
మేడ్చల్ :మయోర ఇండియా ఉద్యోగుల ఆందోళన ఉధృతం....
విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ ఆనందం.....
బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు.....
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన....
ప్రజాస్వామ్యంపై దాడిని సహించేది లేదు!...