ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ఆటో ర్యాలీ......

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ఆటో ర్యాలీ......

ఆటో డీవల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయిన కాంగ్రెస్ ప్రభుత్వం...

 

బి ఆర్ టి యు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ ...

ప్రజాస్వరం,మేడ్చల్:

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి 1000 రోజుల అయిన వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో నిరసనగా సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్, కిష్టాపూర్ - పూడూర్ డివిజన్లలోని రహదారులపై ఆటో డ్రైవర్లతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆటో ర్యాలీ నిర్వహించారు. బి ఆర్ టి యు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు 80 ఆటో లతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1000 రోజులు గడిచినా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల జీవనభృతి అందజేస్తామని, సామాజిక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు తుడుం గణేష్, నాయకులు సందీప్ గౌడ్, నాగరాజు, సుశాంత్ రెడ్డి, వెంకటేష్, రాజకుమార్, రఘుపతి రెడ్డి, శైలేందర్, మహేష్, టి పి ఎస్ కే యు వి శివసేన ఆటో యూనియన్ సత్యనారాయణ గౌడ్, రాజు, శ్రీధర్, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, మహేష్, సాయి, శంకర్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

ప్రజాస్వామ్యంపై దాడిని సహించేది లేదు!... ప్రజాస్వామ్యంపై దాడిని సహించేది లేదు!...
మెదక్‌ బస్సు డిపో రోడ్డుపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల భారీ రాస్తారోకో..... ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం మానుకోవాలి.. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్టుపై...
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు....
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ఆటో ర్యాలీ......
పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వరం ....
సత్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అధ్యక్షుడిగా ఎస్.హరి... 
దొంగతనాల నివారణకు తూప్రాన్ పోలీసుల విస్తృత వాహన తనిఖీలు...
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..