దొంగతనాల నివారణకు తూప్రాన్ పోలీసుల విస్తృత వాహన తనిఖీలు...

దొంగతనాల నివారణకు తూప్రాన్ పోలీసుల విస్తృత వాహన తనిఖీలు...

తూప్రాన్ ,సెప్టెంబర్ 6 (ప్రజాస్వరం) :

ప్రతినిధి పూర్ణారాజు గౌడ్ 

తూప్రాన్ పట్టణంలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తూప్రాన్ పోలీసులు రాత్రివేళల్లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.తూప్రాన్ సీఐ శ్రీ వెంకటరాజా గౌడ్ గారి ఆధ్వర్యంలో, నిన్న అర్ధరాత్రి SI గంగరాజు, SI జ్యోతి మరియు పోలీసు సిబ్బందితో తూప్రాన్ పట్టణంలోని వివిధ ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా నర్సాపూర్ రోడ్, తూప్రాన్ టౌన్ ప్రధాన కూడళ్లు, కాలనీలు, శివారు ప్రాంతాలు మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో చేపట్టిన చర్యలు అనుమానాస్పదంగా ఉన్న 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 4 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.గతంలో జరిగిన దొంగతనాలు మరియు ఇతర నేరాల నేపథ్యంలో ఫింగర్‌ప్రింట్ నిపుణుల సహాయంతో 10 మంది అనుమానిత వ్యక్తుల వివరాలను పరిశీలించి, వారి ఫింగర్‌ప్రింట్లను తనిఖీ చేశారు రాత్రివేళల్లో పట్టణంలోకి వచ్చే, పట్టణం నుంచి వెళ్లే వాహనాలను తనిఖీ చేసి వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర వివరాలను పరిశీలించారు.- అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సీఐ శ్రీ వెంకటరాజా గౌడ్ మాట్లాడుతూ, దొంగతనాల నివారణ, నేరాల నియంత్రణ మరియు ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రాత్రివేళల్లో ప్రత్యేక వాహన తనిఖీలు, పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సాంకేతిక పరిజ్ఞానం మరియు ఫింగర్‌ప్రింట్ డేటా సహాయంతో పరిశీలిస్తున్నామని తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు, దుకాణాలు, గోదాములు మరియు షెడ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Latest News

ప్రజాస్వామ్యంపై దాడిని సహించేది లేదు!... ప్రజాస్వామ్యంపై దాడిని సహించేది లేదు!...
మెదక్‌ బస్సు డిపో రోడ్డుపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల భారీ రాస్తారోకో..... ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం మానుకోవాలి.. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్టుపై...
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు....
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ఆటో ర్యాలీ......
పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వరం ....
సత్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అధ్యక్షుడిగా ఎస్.హరి... 
దొంగతనాల నివారణకు తూప్రాన్ పోలీసుల విస్తృత వాహన తనిఖీలు...
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..