పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వరం ....
గరిసెల సురేందర్ ముదిరాజ్...
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్:
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో దోహదపడుతుందని గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్ అన్నారు. డివిజన్ పరిధిలోని జ్ఞానాపురంలో లబ్ధిదారు నీలూరి స్పందన రాణి భర్త బాలస్వామికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బేరిఈశ్వర్,కోరని భగవాన్ దాస్ ,శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ అధ్యక్షులు గడిల కృష్ణారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాలకుర్తి మురళి గౌడ్,ఫిలిప్స్,మారేపల్లి సుధాకర్,డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్,వినోద్ గౌడ్ ,చింతల భాస్కర్ ముదిరాజ్ ,హరిబాబు, రవీందర్ గౌడ్.మాదాను ఆరోగ్యం, మాజీ వార్డు సభ్యులు జెసింతఅమ్మ, బాలస్వామి, శ్రీకాంత్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు, కాలనీ వాసులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Latest News
07 Sep 2026 15:36:10
మెదక్ బస్సు డిపో రోడ్డుపై బీఆర్‌ఎస్ శ్రేణుల భారీ రాస్తారోకో..... ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం మానుకోవాలి.. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టుపై...


