కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన....
By Prajaswaram
On
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్ నాయకులు...
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్ పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి, ప్రభుత్వం ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్,ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీదేవి,కౌన్సిలర్ నిశిత రెడ్డి మహిళా నాయకురాళ్లు నీలిమ,ఉమా లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.అలాగే నిన్న అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రతిపక్ష నాయకులపై అణచివేత ధోరణి సరికాదని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి, ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. లేనిపక్షంలో ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్య కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ నవీన్ రెడ్డి,మండల ఈశ్వరయ్య,హారత్ రెడ్డి,మహేందర్,శైలేందర్,న్యాయవాది చంద్రశేఖర్,వెంకట్,పద్మ,వరలక్ష్మి,వసంత,శారద లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Latest News
08 Sep 2026 13:26:27
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్ నాయకులు... ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్ పట్టణంలో బీఆర్ఎస్...


