మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు.....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్ కిష్టాపూర్ లోని TGSWR గురుకుల విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం శాపంగా మారింది.ఓ వైపు ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందిచేందుకు కోట్లల్లో ఖర్చు చేస్తుంటే పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల పాలిటా యమదూతలుగా మారారు.పాఠశాలకు గుడ్లు సరఫరా చేసే గుత్తేదారు సకాలంలో పంపిణీ చేస్తున్నప్పటికీ ఆగస్టు కు చెందిన గుడ్లను అందచేస్తున్నారు.ఇరవై రోజుల కిందటి గుడ్లను భోజనంలో విద్యార్థులకు అందిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.ఈ ఆహారంతో అస్వస్తకు గురై రోగాల బారిన పడితే ఎవరు బాధ్యులు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Latest News
11 Sep 2026 14:23:39
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ కిష్టాపూర్ లోని TGSWR గురుకుల విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం శాపంగా మారింది.ఓ వైపు ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందిచేందుకు కోట్లల్లో...


