అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ల సీజ్ ....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్:
కిష్టాపూర్‌లోని కాసా గ్రాండ్ సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 7 భారీ టిప్పర్లను మేడ్చల్ పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు, రవాణా బిల్లులు లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ తహసీల్దార్ భూపాల్ హెచ్చరించారు.
Latest News
11 Sep 2026 14:23:39
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ కిష్టాపూర్ లోని TGSWR గురుకుల విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం శాపంగా మారింది.ఓ వైపు ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందిచేందుకు కోట్లల్లో...


