తునికి ఖల్సాలో స్టిక్కీ ట్రాప్స్ ఏర్పాటు.....

తునికి ఖల్సాలో స్టిక్కీ ట్రాప్స్ ఏర్పాటు.....

వర్గల్ ,సెప్టెంబర్ 11 (ప్రజాస్వరం) :

 

పంటల్లో హానికర పురుగుల నియంత్రణకు స్టిక్కీ ట్రాప్స్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. తునికి ఖల్సా రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్‌కు చెందిన RAWEP విద్యార్థులు రైతులకు ట్రాప్స్ ఏర్పాటు, వినియోగ విధానాన్ని ప్రత్యక్షంగా వివరించారు.పసుపు రంగు ట్రాప్స్‌ను తెల్లదోమలు, ఆఫిడ్స్, జాసిడ్స్ వంటి పురుగుల పర్యవేక్షణకు, నీలం రంగు ట్రాప్స్‌ను త్రిప్స్‌ నియంత్రణకు ఉపయోగించవచ్చని తెలిపారు. పంటలో పురుగుల ఉనికిని ముందుగానే గుర్తించి, వాటి ఉధృతిని బట్టి సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతుల్లో నియంత్రణ చర్యలు చేపట్టవచ్చన్నారు.ఈ సందర్భంగా ఏఈఓ అనిత మాట్లాడుతూ.. స్టిక్కీ ట్రాప్స్ వంటి పర్యావరణహిత పద్ధతులను రైతులు వినియోగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచి గణేష్, ఉప సర్పంచి, వార్డు సభ్యులు, RAWEP విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.