వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన...

వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన...

తూప్రాన్, సెప్టెంబర్ 11 (ప్రజాస్వరం) :

ప్రతినిధి 

వినాయక చవితి సందర్భంగా తూప్రాన్ పట్టణంలో నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు రెవిన్యూ పోలీస్ అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు.వినాయక నిమజ్జనానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో భాగంగా తూప్రాన్ పెద్దచెరువు నిమజ్జన ప్రాంతాన్ని ఆర్డీఓ తూప్రాన్, డీఎస్పీ నరేందర్ గౌడ్ తూప్రాన్ అర్డీఓ బావయ్య తూప్రాన్, సీఐ వెంకట రాజా గౌడ్ తూప్రాన్,ఎసై గంగరాజు ఎంఆర్ఓ,చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా నిమజ్జన ప్రాంతంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, వాహనాల రాకపోకలు, విగ్రహాల నిమజ్జనం సజావుగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించారు.నిమజ్జన కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.