త్యాగాల స్ఫూర్తితో సమైక్యతను కాపాడుకుందాం....

పద్మా దేవేందర్‌రెడ్డి....

త్యాగాల స్ఫూర్తితో సమైక్యతను కాపాడుకుందాం....

జాతీయ సమైక్యతా దినోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి.

 

మెదక్, సెప్టెంబర్ 17 (ప్రజాస్వరం) :

 

భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ దేశ సమైక్యతను మరింత బలోపేతం చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం లో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను కూడా ఎగరవేశారు. ఈ సందర్బంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం ఆనాడు తెలంగాణ సమాజం సాగించిన పోరాటం, యోధుల త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.సమైక్యత అంటే సరిహద్దులు కలవడం మాత్రమే కాదు.. మనసులు కలవడం అని అన్నారు. ప్రజల మధ్య ఐక్యత, విభిన్న సంస్కృతుల మధ్య సామరస్యం, పరస్పర గౌరవం కొనసాగినప్పుడే దేశ సమైక్యత మరింత బలపడుతుందని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ చాటిన సామరస్య విలువలు, జవహర్‌లాల్‌ నెహ్రూ కల్పించిన విశ్వాసం, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చాకచక్యంతో సంస్థానాల విలీనం జరిగి దేశం ఏకీకృతమైందని వివరించారు. ఆనాటి మహనీయుల స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మెదక్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఏం లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ. ఆంజనేయులు, కౌన్సిలర్ జుబేర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్లు అంకం చంద్రకళ, మెంగాని విజయలక్ష్మి, భీమరి కిషోర్, మాయ మల్లేశం, మెదక్ & హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు ఎం. అంజగౌడ్,సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు,మాజీ సర్పంచ్ లు, మెదక్ పట్టణ,మండల నాయకులు,బిఆర్ఎస్వి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

విమోచన దినోత్సవ వేడుకల్లో సరస్వతి ట్రస్ట్.... విమోచన దినోత్సవ వేడుకల్లో సరస్వతి ట్రస్ట్....
తూప్రాన్, సెప్టెంబర్ 17 (ప్రజాస్వరం) :ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ట్రస్ట్ అధ్యక్షులు...
త్యాగాల స్ఫూర్తితో సమైక్యతను కాపాడుకుందాం....
విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ....
కాళ్లకల్ బంగారమ్మ ఆలయంలో బీజేపీ నాయకుల పూజలు...
పర్కిబండ లో ప్రజా పాలన దినోత్సవం...
అయోధ్య రామమందిరం నమూనాలో వినాయక మండపం...
అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు....