విమోచన దినోత్సవ వేడుకల్లో సరస్వతి ట్రస్ట్....
By Prajaswaram
On
తూప్రాన్, సెప్టెంబర్ 17 (ప్రజాస్వరం) :
ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ట్రస్ట్ అధ్యక్షులు లయన్ జానకిరామ్ గౌడ్ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.అనంతరం జానకి రామ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను, నాటి పోరాటంలో పాల్గొన్న వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యతలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలనిఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సరస్వతి ట్రస్ట్ సభ్యులు బొడ్డు శ్రీహరి అశోక్ గౌడ్ వెంకటనారాయణ బిజెపి నాయకులు కె.వేణుగోపాల్ బి. మామిడి వెంకటేష్ జానకి రామ్ మధుసూదన్ , స్థానికులు, యువత తదితరులు పాల్గొన్నారు.
Latest News
17 Sep 2026 13:58:02
తూప్రాన్, సెప్టెంబర్ 17 (ప్రజాస్వరం) :ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ట్రస్ట్ అధ్యక్షులు...


