అయోధ్య రామమందిరం నమూనాలో వినాయక మండపం...
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
ప్రతినిధి:వెంకట్
మేడ్చల్ పట్టణంలోని స్టేషన్ రోడ్‌లో భగత్‌సింగ్ సేన ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయోధ్య రామమందిరాన్ని పోలిన ప్రత్యేక షెడ్‌ను ఏర్పాటు చేసి, శ్రీరాముడు–సీతమ్మ రూపంలో దర్శనమిస్తున్న వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.వినూత్న రూపంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించుకునేందుకు మేడ్చల్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మండపం వద్ద ప్రత్యేక అలంకరణలు చేపట్టి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
Latest News
17 Sep 2026 13:58:02
తూప్రాన్, సెప్టెంబర్ 17 (ప్రజాస్వరం) :ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ట్రస్ట్ అధ్యక్షులు...


