బాధిత కుటుంబానికి ఆర్థిక సహయం ...
By Prajaswaram
On
నార్సింగ్ , సెప్టెంబర్18 (ప్రజాస్వరం) :
నార్సింగి మండల పరిధిలోని శేరిపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల సత్యం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు బండారు గొండా స్వామి యాదవ్ ద్వారా తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి స్పందించి, మృతుడి కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆమె పంపిన ఆర్థిక సహాయాన్ని శుక్రవారం పార్టీ నాయకులు సత్యం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుటుంబ పెద్దను ప్రమాదవశాత్తు కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఈ కష్ట సమయంలో మృతుడి కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి తనవంతు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ అవసరమైన సమయంలో పార్టీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ విజయ్‌కుమార్, వార్డు సభ్యులు కందర్ శ్రీనివాస్, చింతల మల్లేశం, పార్టీ నాయకులు ఇండ్ల శ్రీనివాస్, బోయిని రమేష్, సింగం యాదగిరి, నేరెళ్ల రాజేశ్వర్, కుంటల లచ్చయ్య, చరకం యాదగిరి, జంగం స్వామి, చెప్పాల రమేష్, మేకల శ్రీనివాస్, తాళ్ల రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
19 Sep 2026 16:05:46
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలో కొంత మంది విద్యుత్ అధికారుల పనితీరు విమర్శలకు తవిస్తుంది.అయిన వారికి అరటి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్న చందంగా తయారయింది.పట్టణంలో...


