మేడ్చల్ విద్యుత్తు అధికారుల నిర్వాకం ...
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్ పట్టణంలో కొంత మంది విద్యుత్ అధికారుల పనితీరు విమర్శలకు తవిస్తుంది.అయిన వారికి అరటి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్న చందంగా తయారయింది.పట్టణంలో ఓ విద్యుత్ కనెక్షన్ కి సంబధించిన అంశం చర్చనీయాంశమైంది.కె ఎల్ ఆర్ వెంచర్ 4వ ఫేజ్ లో విద్యుత్ అనుమతులు పూర్తి గా రాకముందే ఓ నిర్మాణానికి మెయిన్ రోడ్ నుండి కనెక్షన్ ఇచ్చారు.ఇలా ఇవ్వడం నిబంధనలకు విరుద్దం అయినప్పటికీ తనకు సంబంధం లేని ఏరియా లో మీటర్ అనుమతులు ఇవ్వడం అధికారుల నిబద్ధతను తెలియజేస్తుంది.సామాన్యుడు తన ఇంటి మీటర్ కోసం దరఖాస్తు చేసుకుంటే సవాలక్ష కారణాలు చూపిస్తు మంజూరును ఆపే అధికారులు అడిగిన వెంటనే దొడ్డి దారిన కనెక్షన్ ఇచ్చిన విద్యుత్ అధికారుల తీరుపై పట్టణ వాసులు విస్మయానికి గురవుతున్నారు.ఇదే విషయం పై ఏఈ రాంబాబు వివరణ కోరగా పిర్యాదు వస్తే కనెక్షన్ తొలగిస్తామని పేర్కొన్నారు.
Latest News
19 Sep 2026 16:05:46
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలో కొంత మంది విద్యుత్ అధికారుల పనితీరు విమర్శలకు తవిస్తుంది.అయిన వారికి అరటి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్న చందంగా తయారయింది.పట్టణంలో...


