పిఎం శ్రీ విద్యార్థుల చందంపేట కోట క్షేత్ర పర్యటన....

పిఎం శ్రీ విద్యార్థుల చందంపేట కోట క్షేత్ర పర్యటన....

చేగుంట, సెప్టెంబర్ 22 (ప్రజాస్వరం) :

చేగుంట మండల కేంద్రంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏడవ తరగతి విద్యార్థులను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్ ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలోని రాజుల కట్టడాల పాఠం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిన్న శంకరంపేట్ మండలంలోని చందంపేట గ్రామంలో ఉన్నటువంటి కోటను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాయిని ప్రవీణ్ మాట్లాడుతూ చందంపేట గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని, చందమ్మ అనే మహిళ ఈ గ్రామానికి నిర్మించిందని, ఈ కోట కూడా చరిత్రలో గొప్ప స్థానం ఉందని, ఒకప్పుడు ఈ గ్రామంలో ముత్యాలకు ప్రసిద్ధి చెందిందని, అందుకే చాలామంది ముత్యాల చందంపేట అని పిలుస్తారని వారన్నారు. ఈ క్షేత్రస్థాయి పర్యటన వలన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధ, సిఆర్పి పులి రమేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ ఉపసర్పంచ్ నర్సింలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

మేడ్చల్‌లో డీజేలకు అనుమతి లేదు ..... మేడ్చల్‌లో డీజేలకు అనుమతి లేదు .....
ప్రజాస్వరం,మేడ్చల్  :మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ అంజిరెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని...
మయోర ఇండియా పరిశ్రమలో తొలి వేతన ఒప్పందం....
వినాయకుల వద్ద అన్నదానం....
పిఎం శ్రీ విద్యార్థుల చందంపేట కోట క్షేత్ర పర్యటన....
పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనకు మెదక్ బీజేపీ మద్దతు....
భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన..
రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్...