పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనకు మెదక్ బీజేపీ మద్దతు....
By Prajaswaram
On
శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు.....
మెదక్ ,సెప్టెంబర్ 22 (ప్రజాస్వరం) :
పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసన కు మెదక్ బీజేపీ నాయకులు పూర్తి మద్దతు పలికారు. ‘శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 97 ను ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులపై ప్రభావం చూపే నిర్ణయాలను పునఃపరిశీలించాలని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బి జె వై ఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
22 Sep 2026 19:22:56
ప్రజాస్వరం,మేడ్చల్ :మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ అంజిరెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని...


