రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్...
By Prajaswaram
On
మెదక్ ,సెప్టెంబర్ 21 (ప్రజాస్వరం) :
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికలను అక్టోబర్ 4 న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. ఎన్నికలకు సంబంధించి తుది సభ్యుల జాబితాను ప్రచురించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 24 న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెదక్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా ప్రకటన, 26న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు చేపడతారు. అక్టోబర్ 4న అవసరమైన పక్షంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. అనంతరం ఫలితాలను ప్రకటించి ఆఫీస్ బేరర్ల ఎన్నిక నిర్వహిస్తారు. నామినేషన్ ఫీజుగా రూ.10 వేల తిరిగి చెల్లించని రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల వివరాల కోసం 9346999257 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
Latest News
21 Sep 2026 16:12:42
నార్సింగ్, సెప్టెంబర్ 21( ప్రజాస్వరం) : నార్సింగ్ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడి ఉత్సవాల్లో భాగంగా,...


