తూప్రాన్ లో 47 ఏళ్ల చరిత్ర కలిగిన సిద్ధి వినాయకుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం ...

తూప్రాన్ లో 47 ఏళ్ల చరిత్ర కలిగిన సిద్ధి వినాయకుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం ...

ఘనంగా మహా అన్న దానం ...

తూప్రాన్, సెప్టెంబర్ 21 (ప్రజాస్వరం )  :

ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్పట్టణంలోని వినాయక నగర్ లో మొట్టమొదటి వినాయకుడు.. 46 ఏళ్లుగా నవరాత్రులు - 47వ సంవత్సరం పూర్తి చేసుకున్న శ్రీ సిద్ధివినాయక అసోసియేషన్ - నిమజ్జనం కోసం సర్వం సిద్ధం చేశారు. సోమవారం రోజు మహా అన్నదానం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో మొట్టమొదటి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి 46 సంవత్సరాలుగా వినాయక నవరాత్రులను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ సిద్ధివినాయక అసోసియేషన్* ఆధ్వర్యంలో ఈ ఏడాది 47వ సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి.47వ సంవత్సరం పూర్తి చేసుకుని నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న గణపయ్య వద్ద సోమవారం రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు.ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై, ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 47 ఏళ్లుగా తూప్రాన్ లో వినాయక ఉత్సవాలకు ఆద్యుడిగా నిలిచిన సిద్ధి వినాయకుడి ఉత్సవాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.నిమజ్జన ఏర్పాట్లు కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.సిద్ధివినాయక సభ్యులు జె కృష్ణ గౌడ్, రాహుల్ గౌడ్, రమేష్ గౌడ్, నాగరాజ్ ప్రణయ్, కార్తీక్, లక్ష్మి నారాయణ, మహేష్ బాను సంతోష్ పన్నీ తదితరులు పాల్గొన్నారు.

Latest News

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన.. భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన..
నార్సింగ్, సెప్టెంబర్ 21( ప్రజాస్వరం) :  నార్సింగ్ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడి ఉత్సవాల్లో భాగంగా,...
రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్...
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి....
50 గంటల పాటు కళా జాతర నిర్వహణ....
గణనాథుడికి ప్రత్యేక పూజలు .....
తూప్రాన్ లో 47 ఏళ్ల చరిత్ర కలిగిన సిద్ధి వినాయకుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం ...
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం గేటుకు ఎర్రటి వస్త్రం.. లేఖతో కలకలం...