50 గంటల పాటు కళా జాతర నిర్వహణ....
By Prajaswaram
On
వాల్ పోస్టర్ ఆవిష్కరించిన రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి....
మెదక్ ,సెప్టెంబర్ 21 (ప్రజాస్వరం) :
అరుణోదయ విమలక్క 50 ఏళ్ల కళా, సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 26, 27, 28 తేదీల్లో 50 గంటల పాటు ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి తెలిపారు. సోమవారం మెదక్ లోని గుల్షన్ క్లబ్ వద్ద ప్రజా సంఘాల నాయకులతో కలిసి కళా జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమలక్క ఐదు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఈ కళా జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి లోని ఆర్టీసీ కళా మండపంలో ఆట, పాట, మాటలతో 50 గంటల పాటు కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
21 Sep 2026 16:12:42
నార్సింగ్, సెప్టెంబర్ 21( ప్రజాస్వరం) : నార్సింగ్ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడి ఉత్సవాల్లో భాగంగా,...


