ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి....

ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు...

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి....

ఫిర్యాదుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలి...

జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించాలి..

మెదక్, సెప్టెంబర్ 21 (ప్రజాస్వరం) :

 ప్రజావాణిలో అందే ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయరాదని, విచారణలోని పురోగతిని ఫిర్యాదుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

Latest News

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన.. భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన..
నార్సింగ్, సెప్టెంబర్ 21( ప్రజాస్వరం) :  నార్సింగ్ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడి ఉత్సవాల్లో భాగంగా,...
రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్...
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి....
50 గంటల పాటు కళా జాతర నిర్వహణ....
గణనాథుడికి ప్రత్యేక పూజలు .....
తూప్రాన్ లో 47 ఏళ్ల చరిత్ర కలిగిన సిద్ధి వినాయకుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం ...
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం గేటుకు ఎర్రటి వస్త్రం.. లేఖతో కలకలం...