తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం గేటుకు ఎర్రటి వస్త్రం.. లేఖతో కలకలం...

తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం గేటుకు ఎర్రటి వస్త్రం.. లేఖతో కలకలం...

తూప్రాన్ ,సెప్టెంబర్ 21 (ప్రజాస్వరం) :

మెదక్ జిల్లా తూప్రాన్ లో కలకలం - మున్సిపల్ కార్యాలయం గేటుకు ఎర్రటి వస్త్రం కట్టి లేఖ విడుదల చేసిన AP TH .                మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం కలకలం రేగింది.కార్యాలయం ప్రధాన గేటుకు గుర్తుతెలియని వ్యక్తులు ఎర్రటి వస్త్రాన్ని కట్టి, ఓ లేఖను ఉంచి వెళ్లారు.ఆ లేఖలో 10 మంది విప్లవ యోధులకు ఉరిశిక్ష విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు లేఖను గుర్తించిన మున్సిపల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లేఖను ఎవరు ఉంచారు, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.మున్సిపల్ కార్యాలయం గేటుకు ఎర్రటి వస్త్రం కట్టి లేఖను ఉంచిన ఘటన తూప్రాన్ లో చర్చనీయాంశంగా మారింది.

Latest News

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన.. భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన..
నార్సింగ్, సెప్టెంబర్ 21( ప్రజాస్వరం) :  నార్సింగ్ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడి ఉత్సవాల్లో భాగంగా,...
రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్...
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి....
50 గంటల పాటు కళా జాతర నిర్వహణ....
గణనాథుడికి ప్రత్యేక పూజలు .....
తూప్రాన్ లో 47 ఏళ్ల చరిత్ర కలిగిన సిద్ధి వినాయకుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం ...
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం గేటుకు ఎర్రటి వస్త్రం.. లేఖతో కలకలం...