గణనాథుడికి ప్రత్యేక పూజలు .....
పద్మ దేవేందర్ రెడ్డి...
By Prajaswaram
On
మెదక్, సెప్టెంబర్ 21 (ప్రజాస్వరం) :
మెదక్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ మాయ గంగమని మల్లేశం, మాయ శ్రీనివాస్ నివాసంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మ దేవేందర్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం మాయ గంగమని మల్లేశం పద్మ దేవేందర్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు దీపక్‌కుమార్, జుబేర్ అహ్మద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News
21 Sep 2026 16:12:42
నార్సింగ్, సెప్టెంబర్ 21( ప్రజాస్వరం) : నార్సింగ్ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడి ఉత్సవాల్లో భాగంగా,...


