మయోర ఇండియా పరిశ్రమలో తొలి వేతన ఒప్పందం....
By Prajaswaram
On
సెప్టెంబర్ 22(ప్రజాస్వరం) :
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని మయోర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 15 ఏళ్ల కంపెనీ చరిత్రలో తొలిసారిగా వేతన ఒప్పందం కుదిరింది. BRTU యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు రూ.10,800 వరకు వేతన పెంపు సాధించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్యామ్ సుందర్ రెడ్డి సమక్షంలో యాజమాన్యం, కార్మిక సంఘం ప్రతినిధుల మధ్య ఒప్పందం జరిగింది. యూనియన్ అధ్యక్షులు, మాజీ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం సాధ్యమైందని తెలిపారు. యాజమాన్యం, కార్మిక శాఖ అధికారులకు యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
22 Sep 2026 19:22:56
ప్రజాస్వరం,మేడ్చల్ :మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ అంజిరెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని...


