యాప్ ద్వారా బుక్ చేసుకుంటేనే యూరియా ఇస్తాం....

మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ ...

యాప్ ద్వారా బుక్ చేసుకుంటేనే యూరియా ఇస్తాం....

చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 25 ( ప్రజాస్వరం ):

చిన్న శంకరంపేట మండలంలో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ యాప్ ద్వారానే ఎరువులు అందించడం జరుగుతుంది, కొంతమంది రైతులకు స్మార్ట్ ఫోన్లు లేక చిన్న ఫోన్లు ఉండడంతో ఓటీపీ చెప్పరాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వారి మొబైల్ ద్వారా యాప్ లో రైతుల వివరాలు నమోదు చేసి ఎరువులను అందజేస్తున్నారు, ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రవీణ్ మాట్లాడుతూ చిన్న శంకరంపేట మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంటుందని ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని నేడు మడూర్ సొసైటీ మరియు గవలపల్లి లోని రామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణానికి ఒక్క వెయ్యి 43 యూరియా బస్తాలు రావడం జరిగిందని రైతులు తమ పాసుబుక్కులకు లింక్ అయినటువంటి మొబైల్ యాప్ ద్వారా బుక్ చేస్తే ఓటిపి రావడం జరుగుతుందని వచ్చిన ఓటీపీని ఆన్లైన్ చేస్తేనే యూరియా సంచులు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు యాప్ సమస్య వచ్చినా మొబైల్ సమస్య వచ్చిన అధికారుల మొబైల్ ద్వారా యూరియా బుక్ చేసి అందివ్వడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లక్ష్మీప్రవీణ్ తో పాటు మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులు పాల్గొన్నారు

Latest News

భార్య భర్తల గొడవ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల ఘర్షణ...  భార్య భర్తల గొడవ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల ఘర్షణ... 
తూప్రాన్ ,మార్చ్ 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చెందిన జ్యోతిని చేగుంట మండలం రాంపూర్ చెందిన...
ఆదర్శ గ్రామాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం.... 
ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపీడీవో....
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక....
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి...
ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్....
బోర్లు వేశారు కానీ....