క్రీడాకారులకు ఘన సత్కరించిన ఎస్పీ...

క్రీడాకారులకు ఘన సత్కరించిన ఎస్పీ...

పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ లో మెదక్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన..

టెన్నిస్‌ లో రాథోడ్ రమేష్ హ్యాట్రిక్ రజత పతకాలు...

జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు....

 

మెదక్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం):

 

సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా గత వారం రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4 వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ లో మెదక్ జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి ఆరు రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ క్రీడాలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గెలుపోటములు సహజమని, విజేతలు జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ప్రదర్శన కోసం కృషి చేయాలని సూచించారు. అలాగే ఓటమి చెందిన క్రీడాకారులు నిరాశ చెందకుండా తమ లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని ప్రోత్సహించారు. జిల్లాకు పతకాలు తీసుకొచ్చిన క్రీడాకారులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీల్లో రాథోడ్ రమేష్ టెన్నిస్ సింగిల్స్, టెన్నిస్ డబుల్స్, గ్రూప్ ఈవెంట్‌లలో పాల్గొని మూడు రజత పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే మెదక్ జిల్లాకు చెందిన భవాని, వీణ, సుష్మ కబడ్డీ పోటీల్లో కీలక పాత్ర పోషించి తమ జట్టును మూడో స్థానానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగనాథ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ఆర్ఎసై మహిపాల్ సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

బోర్లు వేశారు కానీ.... బోర్లు వేశారు కానీ....
మాసాయిపేట, మార్చి 06 (ప్రజాస్వరం):   మండల కేంద్రంలో నూతనంగా బోర్లు వేసి మోటర్లు బిగించడం మరిచిపోయారు. ఇటీవల గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం గ్రామంలో నూతనంగా...
న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....
మహిళ భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ సంతోష్ గోండ స్వామి యాదవ్ భూమి పూజ ....
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గాంధీ విగ్రహం ధ్వంసం..... 
పాఠశాలలో ప్లేట్స్ పంపిణీ....
హోలీ పండగ పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు...
సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్....