గిర్మాపూర్‌లో నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి ...
బీజేపీ నాయకులు
స్థానిక వాటర్‌మ్యాన్‌ను నియమించాలి
మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్‌లో వాటర్‌మ్యాన్ శ్రీరాములు మృతి చెందడంతో గత నెల రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ ను కలిసి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేసి, గిర్మాపూర్ ప్రాంతానికి చెందిన స్థానిక వ్యక్తినే వాటర్‌మ్యాన్‌గా నియమించాలని కోరారు.ఇతర ప్రాంతాలకు చెందిన వారిని వాటర్‌మ్యాన్‌గా నియమించడం వల్ల గిర్మాపూర్ ప్రాంతంలోని నీటి సరఫరా వ్యవస్థపై పూర్తి స్థాయి అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని స్థానిక వాటర్‌మ్యాన్‌ను నియమించి, నిరంతర నీటి సరఫరా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు కొండం ఆంజనేయులు ముదిరాజ్, బీజేవైఎం జిల్లా నాయకులు రాఘవ రెడ్డి, డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు చీర్ల సత్యనారాయణ, డివిజన్ బిజెపి కార్యదర్శి బండి విష్ణు గౌడ్ తదితరులు ఉన్నారు.


