ప్రైవేటీకరణను అడ్డుకుని ఉద్యోగ, కార్మిక హక్కులను కాపాడాలి ....

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర్ రావు ....

ప్రైవేటీకరణను అడ్డుకుని ఉద్యోగ, కార్మిక హక్కులను కాపాడాలి ....

తూప్రాన్ లో జిల్లా సదస్సు... 

తూప్రాన్, సెప్టెంబర్ 28 (ప్రజాస్వరం) :

పూర్ణారాజు గౌడ్ ప్రతినిధి 

ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఎంతో కీలకమైనవని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర్ రావు అన్నారు. “ప్రభుత్వ రంగ సంస్థలు – వాటి పరిరక్షణ” అంశంపై తూప్రాన్ పట్టణంలో శివ సాయి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఈశ్వర్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ప్రజల ఆస్తులని, వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రజా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. విద్యుత్, బ్యాంకింగ్, రవాణా, ఉక్కు, బొగ్గు తదితర కీలక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను ఉపసంహరించుకుని, వాటి అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అనేది ఉద్యోగులు, కార్మికుల సమస్య మాత్రమే కాదని, అది దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశమని ఈశ్వర్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి,జిల్లా అధ్యక్ష,కార్యదర్శిలు యం. నర్సoలు.రవీంద్ర ప్రసాద్, అడ్వైజర్ స్వామి,ఉపాధ్యక్షులు నాగరాజు,ఫాసి,హనుమంత్. అశోక్,వెంకటేష్,శ్రీను యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Latest News

బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి  భరోస..... బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి భరోస.....
మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు.. చిన్న శంకరంపేట,సెప్టెంబర్ 29 ( ప్రజాస్వరం) : ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, బాధితుల...
మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎం. ఖలీం మియా...
హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు..
ప్రైవేటీకరణను అడ్డుకుని ఉద్యోగ, కార్మిక హక్కులను కాపాడాలి ....
గిర్మాపూర్‌లో నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి ...
మేడ్చల్ కాంగ్రెస్ లో సహకార చిచ్చు ...
మేడ్చల్ CSI వెస్లీ చర్చిలో 80వ CSI ఫార్మేషన్ డే...