బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి భరోస.....
By Prajaswaram
On
మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు..
చిన్న శంకరంపేట,సెప్టెంబర్ 29 ( ప్రజాస్వరం) :
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, బాధితుల కష్టాల్లో భాగస్వామిగా ఉంటున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మంగళవారం చిన్న శంకరంపేట మండలంలో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. చందంపేట గ్రామానికి చెందిన విలేకరి తాటికొండ సుధాకర్ తండ్రి కృష్ణ ఇటీవల మృతి చెందారు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి, కృష్ణ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.అనంతరం జంగారాయి గ్రామానికి చెందిన బొమ్మరబోయిన కృష్ణ కుమార్తె కీర్తన ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కీర్తన మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆయనతో పాటు గ్రామ అధ్యక్షుడు గడ్డం సురేష్, మాజీ మార్కెట్ డైరెక్టర్ బందెల ప్రభాకర్, సొసైటీ డైరెక్టర్ చౌటకూరి శ్యామ్, యూత్ అధ్యక్షుడు దుర్గం మహేష్‌గౌడ్, సిద్ధ రాములు, బందెల బన్ని, కరోల అనిల్, దేవదాస్, ముత్యాలు, భూపాల్‌రెడ్డి, గడ్డం నందు, నరసింహులు, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మీపతి, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు బందెల సుధాకర్, మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, రామాయపల్లి సర్పంచ్ రేణుక తిరుపతి, మాజీ సర్పంచ్ గుగులోత్ సుధాకర్, మాజీ ఎంపీటీసీ బాచుపల్లి యాదగిరి, మాజీ సర్పంచ్ తోట రమేష్, గజట్లపల్లి ఉపసర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Latest News
29 Sep 2026 15:00:29
మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు.. చిన్న శంకరంపేట,సెప్టెంబర్ 29 ( ప్రజాస్వరం) : ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, బాధితుల...


